దివ్యాంగుల‌కు భరోసా..ఆసరా పింఛన్లుపెంపుపై సీయం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం* కృత‌జ్ఞ‌త స‌భ‌లో పాల్గొన్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మ‌ల్, జూన్ 12: దివ్యాంగుల అభ్యున్నతికి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్ష‌న్ హాల్ ఏర్పాటు చేసిన దివ్యాంగుల కృత‌జ్ఞ‌త స‌భ‌లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. దివ్యాంగుల‌కు పింఛన్‌ ను రూ.4,116 పెంచినందుకు గాను సీయం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, దివ్యాంగులు క్షీరాభిషేకం చేశారు. పింఛన్‌ పెంపుపై నిర్మ‌ల్ జిల్లాలోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. పింఛన్‌ను రూ.4,116కు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు వృద్ధులకు కేవలం రూ.200, దివ్యాంగులకు రూ.500లు పింఛన్లు మాత్రమే ఇచ్చేవారని.. సీయం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మ‌న‌కు మంచి రోజులొచ్చాయని అన్నారు.2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రూ.200 పింఛన్‌ను రూ.1,000, దివ్యాంగుల పింఛన్‌ను రూ. 500 నుంచి రూ.1,500 పెంచిందని, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,000ల పింఛన్‌ ను రూ.2,016, దివ్యాంగుల‌ పింఛన్‌ను రూ. 1,500- రూ.3,016 పెంచింది. అదేవిధంగా ఆసరా పింఛన్ల పెంపుతోపాటు ఫించ‌న్ దారుల‌ వయోపరిమితిని 57 ఏండ్లకు త‌గ్గించార‌ని వివ‌రించారు. అంతేకాకుండా పెరుగుతున్న ధరలకనుణంగా ఏ పనిచేయలేని దివ్యాంగులకు పింఛన్‌ సరిపోవడం లేదనే ఆలోచనతో మంచిర్యాల సభలో కేసీఆర్‌ అదనంగా వెయ్యి రూపాయలను పెంచుతున్నామని, వచ్చేనెల నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించార‌ని పేర్కొన్నారు.
దేశంలోనే దివ్యాంగులకు అత్యధిక పింఛన్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడా రు. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆసరా పింఛన్లు ఈ స్థాయిలో ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పేదలకు కల్యాణలక్ష్మి, రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలతో పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘ‌న‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking