గాంధీ జ్ఞాన్ మందిర్ తిలక్ పార్క్ కోఠి మెటర్నటీ హాస్పీటల్ ఫుట్‌పాత్‌ల కబ్జాదారులను తొలగించండి: బీ.సతీష్‌గౌడ్
గోషామహల్ నియోజకవర్గం -గన్‌ఫౌండ్రి డివిజన్ -కోటి హాస్పిటల్ పార్కింగ్ ఫ్రీ మరియు ఫుత్ పాత్ కబ్జాలా తొలగింపు -మనవి
గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా తమరికి మనవి చేయునది ఏమనగా గత చాలా కాలం నుండి కోటి మేటర్నిటీ హాస్పిటల్ ఫుత్ పాత్ పూర్తిగా ముసివేసి పాదాచారులకు నడకకు అవకాశం లేకుండా ఉండడము మరియు రోడ్ మీద నుండి వెళ్లడానికి వీలు లేకుండా ద్విచక్రాల పార్కింగ్ ఉండడం వల్ల ప్రజలకు వాహనాలలో ప్రయాణించే వారు తీవ్ర ఇబంధులు ఏర్పడు తున్నాయి. తమరు పరిశీలించి తగు చర్యలు తీసుకోగలరని మనవి. కోటి హాస్పిటల్ లో తగు పార్కింగ్ సౌఖర్యము కలగివున్నది.

ఈ లేఖను అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ సుల్తాన్ బజార్ డివిజన్ హైదరాబాద్ సీటీ పోలీస్ మరియు డిప్యూటీ కమీషనర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ 14 గోషామహల్ కు బద్దం సతీష్‌గౌడ్ కన్వీనర్ గోషామహల్ కాన్సిస్టేన్సీ డెవలప్‌మెంట్ ఫోరం మరియు కాంగ్రెస్ సీనీయర్ లీడర్ అందజేయడమైనది. ఈ సందర్భంగా బద్దం సతీష్‌గౌడ్ మట్లాడుతూ గాంధీ జ్ఞాన్ మందిర్ తిలక్ పార్క్ కోఠి మెటర్నటీ హాస్పీటల్ ఫుట్‌పాత్ లు పూర్తిగా కబ్జాకు గురై పాదాచారులకు నడవడానికి వీలులేక మెయిన్ రోడ్‌నుంచే నడవడం జరుగుతున్నది.దీని వలన ట్రాఫీక్‌జాం యాక్సిడెంట్లకు మూలకారణమవుతున్నది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఫుట్‌పాత్ కబ్జాదారులను తొలగించి ఫుట్‌పాత్‌లపై నడిచేవిధంగా ఏర్పాటు చేయగలరని అన్నారు.