రేణుక ఎల్లమ్మ, బీరన్న జాతరలో ఎమ్మెల్యే.

 

ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలి.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి మే 22

హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ లో మంగళవారం రాత్రి జరిగిన రేణుక ఎల్లమ్మ జాతర, బుధవారం హుజురాబాద్ లో జరిగిన బీరన్న జాతరకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెండు జాతరలలో మొక్కలు అప్పజెప్పారు. అనంతరం భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుళ్ళని కోరుకున్నానని అన్నారు. తెలంగాణ మొత్తం పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు. రానున్న వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పండించే రైతులకే బోనస్ ఇస్తామనడం సరైనది కాదని, ఏ రకమైన వడ్లను పండించిన తప్పకుండా బోనస్ ఇవ్వాలని అన్నారు. రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking