జిల్లా అదనపు కలెక్టరు వియయేందర్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 20:
గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టరు వియయేందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ నెల 26 న కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సోమవారం జిల్లా రెవిన్యూ అధికారి హరిప్రియ తో కలిసి జిల్లా అధికారులు, సోలీసు అధికారులతో సమీకృత అధికారుల కార్యాలయ మిని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పోలీస్ గౌరవ వందన స్వీకరణ, బందోబస్తు ఏర్పాట్లను నిర్వహించాలని, స్టేజ్, సీటింగ్, పి.ఎ. సిస్టమ్, త్రాగునీరు,పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృ ద్ధ, సంక్షేమ పథకాలు పై సందేశ పుస్తకమును నిర్ధేశించిన సమయంలోపు రూపొందించాలని, పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, గ్రౌండ్ లో మెడికల్ టీమ్ తో ఎమర్జెన్సీ సేవలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్తమ సేవలందించే ఉద్యోగులను గుర్తించి ఉత్తమ సేవా ప్రశంసా పత్రాల కోసం ప్రతిపాదనలు పంపాలని కోరినారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా అత్యంత ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియచేసే స్టాల్స్ ఏర్పాట్లు కు సన్నదంగా ఉండాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు సమన్వయంతో గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు నిర్వహించే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రోటోకాల్ నిబంధనలను జిల్లా అధికారులు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
కార్యక్రమంలోసంబందిత ఎసిపి రాములు, ఎఓ రామోహన్, జిల్లా సంబంధిత శాఖల అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.