ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 26 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అతిధి అధ్యాపకులతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని శనివారం మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు కు కళాశాల ఆవరణలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్స్ గా గత 20 ఏండ్లుగా సేవలందిస్తున్నామని, తమలో ఇప్పటికీ రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని,గెస్ట్ ఫ్యాకల్టీని ఆటో రెన్యువల్, కన్సాలిడేటెడ్ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వేతనాన్ని అందించాలని వినతిపత్రం లో పేర్కొన్నారు. అధ్యాపకుల,సిబ్బంది సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంటాక్ట్ లెక్చరర్స్ రాజ్ కుమార్,శ్రీనివాస్,సంధ్య, కవిత,మల్లయ్య,రాం చందర్, సంధ్య రాణి గెస్ట్ లెక్చరర్స్ మహేష్,సతీష్,రవీందర్ , సత్యనారాయణ,కుమార్, అపూర్వ,భవాని సౌజన్య , అరుణ,రాజలింగం, బోధనేతర సిబ్బంది పీ శ్రీనివాస్,సునీత, శ్రీలత, పింగళి శ్రీనివాస్ పాల్గొన్నారు.