అభివృద్ధి,సంక్షేమాన్ని మరిచి కుల,మతాల మధ్య చిచ్చు పెట్టడమే బిజెపి ఎజెండా
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 20 : మంచిర్యాల నియోజకవర్గం జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు హజీపూర్ మండలంలో చివరిరోజు ర్యాలీ గ్రామం నుండి గడపూర్ గ్రామం వరకు శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులతో కలిసి మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…బిజెపి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు సురేఖ అన్నారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమకూర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.ఈ పాదయాత్రలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ-ముని, మండల కోఆర్డినేటర్, నాయకులు,మహిళా నాయకురాలు,కార్యకర్తలు పాల్గొన్నారు