చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి

బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్
హైదరాబాద్ జూలై 140;చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మహిళ నాయకురాల్లు సమావేశం ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి 26ఏండ్లు పూర్తయినా రిజర్వేషన్లను అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. సామాజిక స్ఫూర్తికి విరుద్ధమని భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణ అయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు శీతలగిడ్డంగిలో సమాధి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు సమాజంలో మహిళల పాత్రను వే న్నోళ్ల పొగుడుతారు కానీ రాజకీయరంగంలో వారికి సమ ప్రాధాన్యం కల్పించడానికి వెనకడుగు వేస్తారని అన్నారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోబేడా బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులుగగనం వెంకట్ స్వామి, సినీ దర్శకులుసేనా పతి,సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ సీఈవో పరమేశ్వరి, ఉషా నాగ ప్రసూనా, హైకోర్టున్యాయవాదిమంజుల, మేరీ,రమేష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking