‘‘అక్రమ ఇసుక కు అడ్డేది’’ కథనానికి స్పందన

ప్రజాబలం దినపత్రికలో 12.12.2023 మంగళవారంనాడు ప్రచరితమైన కథనంనకు గాను స్థానిక నాయకుల స్పందన. ఇటీవల ప్రజాబలం పత్రికలో ‘‘అక్రమ ఇసుక కు అడ్డేది’’ శీర్షికన వెలువడిన కథనానికి స్థానిక నాయకులు స్పందించారు. సిరిసిల్ల పట్టణం లోని నెహ్రూ నగర్‌ మానేరు ఒడ్డున జిల్లా ఆర్‌ఎంపీ భవనం ముందు నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తూ స్థానికులను ఇబ్బందులు, భయ భ్రాంతులకు గురి చేయగా వారి విన్నపాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యకు పరిష్కారంగా వాగు నుండి అక్రమంగా ట్రాక్టర్లు వచ్చే దారిలో కందకం తవ్వారు. దీంతో ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు నిలిచిపోయాయి. సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking