జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి జూలై 26
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని స్థానిక గాంధీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ బాబు పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ ఎస్ సి ఎస్ డి ఎఫ్ ను 36,750 నుండి 33,150 కోట్లకు 2024 బడ్జెట్‌లో య్యో కాంగ్రెస్ ఎస్ సి ఎస్ డి ఎఫ్ నుండి 3500 కోట్లను తగ్గించింది. కేంద్ర ప్రభుత్వంపై నరేంద్ర మోడీపై ఈ రాజ్యాంగాన్ని మారుస్తాడని రిజర్వేషన్లు తొలగిస్తాడని విషం చిమ్మిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దళితులని మోసం చేసిండు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3500 కోట్ల రూపాయలను మా దళితులకు కేటాయించాల్సిన నిధులకు కోత పెట్టిండు.దళితుల పాక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది.అంబేద్కర్ అభయస్తం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేడు బడ్జెట్ లో కూడా కోత పెట్టడం ద్వారా దళితుల ఆగ్రహానికి లోను కాక తప్పదు. రానున్న కాలంలో కచ్చితంగా దళితులు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతరు.వెంటనే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని ఎస్సీ మోర్చ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా దళిత మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్, రాకేష్ ఠాగూర్, అమృతలక్ష్మి, అనిత, సుశీల, తూడి రవిచంద్ర రెడ్డి, యనమనగండ్ల రామస్వామి, ఊడుగుల మహేందర్,తాళ్లపల్లి తిరుపతి, గండికోట సమ్మన్న, నాగపురి విజయ్, ఇల్లందుల శ్రీనివాస్, పసునూటి రమేష్, కుమార్ ,గాజుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.