ప్రజాబలం కొల్చారం మండలం అక్టోబర్ 19
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొంగోడు నాయిని జలాల్పూర్ పిఎసిఎస్ కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు ఈరోజు పిఎసిఎస్ సీఈవో సాయి రెడ్డి ఆధ్వర్యంలో లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రైతులకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రభుత్వం కేటాయించిన క్వింటాలుకు ఏ గ్రేడ్ రకానికి 2320 బి గ్రేడ్ రకానికి 2300 రూపాయలుధరకే వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కొనుగోలు కాదని 48 గంటల్లో రైతులకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇతరుల దళారీల మాటలు నమ్మవద్దని ముఖ్యంగా సన్న రకం వడ్లకు 500 బోనస్ గా ప్రకటించడం వర్ణనాతీతం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ వైస్ చైర్మన్ గంపల లక్ష్మయ్య డైరెక్టర్లు శేషగిరి పాండరి మండల సీనియర్ నాయకులు రాయన్న వెంకట నరసింహులు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ మాజీ వార్డు మెంబర్ ఆగమయ్య ఏగొండ మల్లేశం బిజెపి నాయకులు దాసు నర్సింలు రైతులు కొమురయ్య పెంటప్ప శాఖయ్య తదితరులు పాల్గొన్నారు