మహిళల భద్రతే షి టీమ్ లక్ష్యం.

 

విద్యార్థులు సెల్ఫోన్, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తాం.

షి టీమ్ అధికారి శ్రీలత, పట్టణ సిఐ వరగంటి రవి.

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 11

మహిళల భద్రతే షి టీమ్ లక్ష్యమని మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి అండగా షి టీమ్ అందుబాటులో ఉంటుందని విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో షీ టీం అధికారి శ్రీలత పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల కాకతీయ మహిళ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, మహిళల పట్ల ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించ కూడదని అలా చేస్తే వారికి చట్టంలో కఠినమైన శిక్షలు ఉంటాయని వారు తెలిపారు. మహిళలకు అండగా షి టీం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందని ఏ సమస్య వచ్చిన స్థానిక పోలీసులకు గాని షీ టీం అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. విద్యార్థి దశ నుండే కష్టంతో కాకుండా ఇష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బంగారు బాటలో ఉంటుందని మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్న మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇప్పటినుండే కష్టపడి చదువుకోవాలని వారికి సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు దురాలవాట్లకు దూరంగా ఉండాలని డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని అంతేకాకుండా సెల్ఫోన్ కు ఎంత దూరంగా ఉంటే అంత భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు. సెల్ఫోన్ వాడకం ద్వారా మంచి ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా చెడు ఉంటుందని కాబట్టి సెల్ఫోన్ అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మీకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువులకు లేదా స్థానిక పోలీసులకు షీ టీం సభ్యులకు తెలపాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking