మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా శలాక రాజేశ్వరశర్మ.

ప్రతిపాదించి ఏక గ్రీవంగా తీర్మానించిన సర్వ సభ్య సమావేశం.

లాంఛనంగా మార్చి 18న ఎన్నికలు.

ధన్యవాదములు తెలిపిన శాలాక రాజేశ్వర శర్మ.

తూప్రాన్, ఫిబ్రవరి, 19. ప్రజాబలం ప్రతినిధి :-

మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా శలాక రాజేశ్వరశర్మ ను బుధవారం తూప్రాన్ పెద్ద చెరువు కట్ట పై ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించి, ఏక గ్రీవంగా తీర్మానించి ప్రతిపాదించారు. కాగా మార్చి 18న జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లాంఛనంగా ఎన్నికలు నిర్వహించి అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం మూడు డివిజన్ల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి మార్చి 18న ఎలక్షన్స్ రాజేశ్వర శర్మను జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తామన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలో వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద బ్రాహ్మణ సంఘం మెదక్ నర్సాపూర్ తూప్రాన్ డివిజన్ల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బ్రాహ్మణ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు తూప్రాన్ కు చెందిన శలాక రాజేశ్వర శర్మను జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. అన్ని మండల కేంద్రంలో బ్రాహ్మణ సంఘభవణ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు సోమయాజుల రవీంద్ర శర్మ, ఉదయ్ కుమార్ శర్మ, శలాక రాజేశ్వరశర్మ ,మెదక్ డివిజన్ అధ్యక్షులు లింగమూర్తి శర్మ, ప్రధాన కార్యదర్శి వైద్య శ్రీనివాస్ శర్మ ,నర్సాపూర్ అధ్యక్షులు హరిప్రసాద్ శర్మ ,తూప్రాన్ రెవెన్యూ డివిజన్ అధ్యక్షులు శలక ఆత్రేయశర్మ,రాధాకృష్ణ శర్మ ,శ్రీనివాస్ శర్మ,రవి కాంత్ శర్మ,సాయి శర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking