మొదటి తారీకు జీతాలు ఇవ్వాలి : తపస్ రాష్ట్ర కార్యదర్శి దుబాషి భాస్కర్

 

మెదక్ మాసాయిపేట్ ప్రజాబలం న్యూస్ :-

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మహబూబ్ నగర్, రంగారెడ్డి,హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డిని గెలిపించాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాసాయిపేటలో తపస్ నాయకులు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా తపస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు మొదటి తారీకు జీతాలు ఇవ్వాలని,
పిఇటిల,పండిట్ల అప్గ్రేడేషన్ చేయాలని, బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని వారు అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలంటే ప్రశ్నించే గొంతుకైనటువంటి తపస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తపస్ నాయకులు ఆర్వి రామారావు, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఉపాధ్యక్షులు చక్రవర్తి, తపస్ మండల అధ్యక్షుడు రంగారెడ్డి, నర్సింగరావు, సమిత తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking