కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కంకణాల పాండు

 

మెదక్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి22 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తూప్రాన్ మండలం కోనాయిపల్లి పిబి గ్రామంలో గ్రామ సర్పంచ్ కంకణాల పాండు BRS మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్ తో కలిసి ప్రారంభించారు. గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి కంటి అద్దాలను, మందులను వైద్యులు పంపిణీ చేశారు. కంటి చూపు పూర్తిగా మందగించిన వారికి శస్త్ర చికిత్స చేసుకోవాలని సూచించారు.. ప్రభుత్వమే ఉచితంగా రెండు మూడు నెలల వ్యవధిలో కంటి శస్త్ర చికిత్సలు చేయిస్తుందని వైద్యులు తెలిపారు.. పేద ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కంకణాల పాండు, BRS మండల పార్టీ అధ్యక్షుడు పంజాల ఆంజనేయులు గౌడ్ లు పిలుపునిచ్చారు. సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య అధికారి స్రవంతి, వైద్య సిబ్బంది కళ్యాణి, సంధ్య, దుర్గా రెడ్డి, సురేష్, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ, ఏఎన్ఎం వెంకటలక్ష్మి, శ్యామల, ఉప సర్పంచ్ రమ్య శంకర్, వార్డు సభ్యులు , వివో ఏ స్వరూప, అంగన్వాడి టీచర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking