మెదక్ సిఎస్ఐ చర్చ్ లో క్రిస్మస్ వేడుకల్లో గిరిజన అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ .రాష్ట్ర ప్రజలందరికీ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సర్వ మతాలను గౌరవిస్తూ రాష్ట్ర శ్రేయస్సును కోరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏసుప్రభువు ఆశిశులు ఉండాలని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు ఉండలని కోరారు…ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ న్నారు అందులో భాగంగా క్రైస్తవ సోదరులకు క్రిస్టమదర్భంగా గిఫ్ట్ ప్యాకెట్లు ఇస్తూ గొప్పగా సన్మానించుకోవడం జరుగుతుందన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో కూడా అభివృద్ధి చెందలనే ఉదేశ్యం తో బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని దానిపై ఏసుప్రభువు చల్లని చూపు నిండు మనసు ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కుటుంబ సభ్యులతో మెదక్ చర్చిని సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు: మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంత గొప్ప మహా దేవాలయం మన మెదక్ లో ఉండటం అదృష్టం. పేదవారి కోసం కట్టిన ఈ మహాదేవలయం ఆసియా ఖండంలోని రెండో పెద్ద చర్చ్ గా ప్రసిద్ధి చెందడం గొప్ప వరం. ఏసుప్రభువు చూపిన మార్గాలను అనుసరిస్తు ముందుకు వేళ్ళని కోరారు. అలాగే మంత్రి సత్యవతి రథోడు ,ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లను చర్చ్ నిర్వాహకులు గురువులు దీవెనలు అందించి శాలువలతో సన్మానించారు.. అంతకు ముందు చర్చి ప్రగణంలో కేకు కట్ చేశారు.