వైజ్ఞానికంగా సైన్స్ కల్చరల్ ఎగ్జిబిషన్

ఆకట్టుకున్న కివి పాఠశాల విద్యార్థుల సైన్స్ ప్రదర్శన

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి ఫిబ్రవరి28:

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని
పురస్కరించుకొని అండర్ రైల్వే గేట్ ప్రాంతము నందు గల కివి పాఠశాలలో సైన్స్ కల్చరల్ ఎగ్జిబిషన్ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ దాసి సతీష్ మూర్తి ,వైస్ ప్రిన్సిపల్ అన్నదేవర ప్రవీణ్ కుమార్ ,డైరెక్టర్ రజిని లు తమ చేతుల మీదుగా ప్రారంభించారు. పిల్లలు తయారుచేసిన ఎన్నో వైజ్ఞానిక ప్రాజెక్ట్లు ఆకట్టుకుంటూనే ఆలోచింపచేసాయి. అందులో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ రాబరీ సీవీజ్ మోడ్యులర్, యాంటీ సూసైడ్ ఫ్యాన్ ,గ్యాస్ లీకేజ్ అలారం, ఫ్రెండ్లీ స్పెట్స్ ఫర్ బ్లైండ్, రివర్ క్లీనింగ్ బోర్డ్ ,స్మార్ట్ ట్రైన్, కార్బన్ ప్యూరిఫికేషన్ ,స్పీడ్ బ్రేకర్ ద్వారా కరెంట్ , సీడ్ ప్రొటెక్టర్,లు ఎన్నో ప్రత్యేకతలను చాటుకున్నాయి . సంస్కృతి సాంప్రదాయపరమైన అంశాలలో మన గ్రామ దేవత బొడ్రాయి ,తెలంగాణ పచ్చళ్ళు, మన తెలంగాణ ప్రసిద్ధ స్థలాలు, మన సంస్కృతిని ప్రతిబింబించేలా తయారుచేసిన ఎగ్జిబిట్స్ ఎంతగానో ఆకట్టుకున్నవి. ఈ ఎగ్జిబిట్స్ ని వైజ్ఞానికంగా మనోరంజకంగా తీర్చిదిద్దిన దివ్యశ్రీ, మంజుల, శాంతకుమారి, స్వాతి, స్వప్న, లక్ష్మి ,సంగీత, సరిత, రంజితలను పాటశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది..

Leave A Reply

Your email address will not be published.

Breaking