టీ. ఆర్. టీ. ఎఫ్.
ప్రధాన కార్యదర్శి సిద్ధుల మహేశ్వర్
ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి నిజాంపేట్
31ఆగస్టు 2024 :
మెదక్ జిల్లానిజాంపేట్ మండల టీ. ఆర్. టీ. ఎఫ్.ప్రధాన కార్యదర్శి గా సిద్దుల మహేశ్వర్ యూపీస్ తిప్పనగుల్ల గారిని ఎన్నుకోవడం జరిగింది .(టీ ఆర్ టీ ఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఐలయ్య మాట్లాడుతూ సీపీస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండుతో టీజీజాక్ గా ఉద్యోగ, ఉపాధ్యాయ,కర్షక,కార్మీక సంఘాలన్నీ సంయుక్తంగా నిర్వహిస్తున్న పెన్షన్ విద్రోహ దినం(సెప్టెంబర్-1)ని విజయవంతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు కోరారు. సెప్టెంబర్ 1 2004 నుండి అమలు చేయబడుతున్నటువంటి సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని ఓ పి ఎస్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనైనది
అదేవిధంగా ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యుపిఎస్ పెన్షన్ విధానాన్ని (టీ ఆర్ టీ ఎఫ్ )పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే రేపు మెదక్ పట్టణ కేంద్రంలో జరిగే పెన్షన్ విద్రోహ దినాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.ఈ సమావేశంలో జిల్లా అదనపుప్రధాన కార్యదర్శి దేశపతి మోహన్ శర్మ నిజాంపేట్ మండల అధ్యక్షులు నవీన్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు