ఏడుగురు కౌన్సిలర్లు రాజీనామా.
ముఖ్యమంత్రిని కలిసి కాంగ్రెస్ లో చేరిక
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, ఆరుగురు కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కౌన్సిలర్లు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకులు కౌన్సిలర్ రాముని గారి శ్రీశైలం గౌడ్ , కోడిప్యాక నారాయణ గుప్తా, మామిళ్ల జ్యోతి కృష్ణ, రవీందర్ రేడ్డి, రాజు , చెలిమెల ప్రియాంక తండ్రి రఘుపతి ,మైనార్టీ నాయకులు హజర్ , బిజెపి నాయకులు జమాల్పూర్ లక్ష్మీబాయి నర్సోజి
తేలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సెక్రెటరీయెట్ సచివాలయంలో కలిసి తూప్రాన్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను మున్సిపాలిటీ చైర్మన్ వ్యవహార తీరును వివరించినట్లు వారు తెలిపారు.
అనంతరం గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సారెడ్డి అధ్వర్యంలో బిసి సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమక్షంలో తూప్రాన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి, కౌన్సిలర్ భగవాన్ రెడ్డి , రవీందర్ గుప్తా నాగరాజు గౌడ్, వెంకట్ రెడ్డి, విశ్వ రాజ్, శ్రీకాంత్ ఉమర్, అనిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prev Post