జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్
విశాఖపట్నం ఫిబ్రవరి 23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 65% బీసీలకే ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రీ వేణుమాధవ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈరోజు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సిపి ఫ్లోర్ లీడర్ వి విజయసాయి రెడ్డి గారిని టిటిడి చైర్మన్ మరియు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ గౌరవ వైవి సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఈ నిర్ణయం దేశంలో చారిత్రాత్మక నిర్ణయమని బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న చోట కూడా ఇటువంటి ప్రాధాన్యత బీసీలకు దక్కలేదని సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బలహీన వర్గాల తరఫున తమరు అభినందనలు తెలియజేయవలసిందిగా కర్రి వేణుమాధవ్ వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం పిఆర్వోలు బంగారు దేవుళ్ళు విజయనగరం గుంటపల్లి ప్రసాద్ గాజువాక నల్లూరి అశోక్ కుమార్ దాసు రామిశెట్టి సురేష్ మరియు పలు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.