ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 07 : మంచిర్యాల జిల్లాలోని
లక్షెట్టిపేటలోని లిటిల్ స్టార్ గ్రామర్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు కృష్ణుడు,గోపికల వేషధారణతో వచ్చారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ సంతపురి కిషోర్ కుమార్ మాట్లాడుతూ…విద్యార్థులకు శ్రీకృష్ణుని గొప్పతనం గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.అనంతరం గోపికల వేషధారణలో విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.అలాగే ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మహమ్మద్ హమీద్, మినుముల శ్రీనివాస్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు.