మే 5 న ఐపిసి దివ్యాంగుల విభాగం రాష్ట్ర సమావేశం

హైదరాబాద్ మే 4 (ప్రజాబలం ప్రతినిధి );రాష్ట్రము లో దివ్యాంగుల సమస్యల పై చర్చంచడానికి ఈ నెల 5 న మేడ్చల్ జిల్లా కీసర లోని శ్రీరామ లింగేశ్వర కాలనీ లో కి అన్ని దివ్యంగా సంఘాలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం జాతీయ అధ్యక్షురాలు శివలెంక నాగ ఉదయలక్ష్మి తెలిపారు.రాజ్యాధికరం లో దివ్యాంగుల భాగస్వామ్యం సాధించాలి అంటే డివ్యాంగులు దివ్యంగా సంఘాలు జాతీయ స్థాయిలో పోరాడవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.డివ్యాంగుల సమస్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.జాతీయ స్థాయిలో వారి హక్కులు…చట్టాలు అమలు చేసేందుకు ఆక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలగు అంశాలపై చర్చించడానికి ఈ సమావీశాన్ని ఏర్పాటు చిసినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధి ఐపిసి జాతీయ అధ్యక్షుడు కేబి శ్రీధర్, అడ్వైజర్ నండూరి రమేష్ హాజరవుతున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking