కొల్లూరులో రెండవ విడత డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 21 సెప్టెంబర్ 2023: గ్రేటర్‌ పరిధిలో తేల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో రెండవ విడత డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 500 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు,
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్ర‌జ‌లను గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు కానీ బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం మాత్రం పేద‌ల‌ను గుండెల్లో పెట్టి చూసుకుంటుంద‌న్నారు. ఇవాళ ప్ర‌తిప‌క్షాలు అనేక ర‌కాల మాట‌లు చెప్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు య‌త్నిస్తున్నాయని మీరు ఆలోచించాలని, ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు కల్యాణ‌ల‌క్ష్మి కార్య‌క్ర‌మం తెచ్చింది కేసీఆర్ అని, కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్ర‌శ్నించారు. బ‌స్తీ ద‌వఖానాల్లో పేద రోగుల‌కు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని గ‌త ప్ర‌భుత్వాల హయాంలో న‌ల్లా బిల్లు క‌ట్ట‌క‌పోతే తెల్లారేస‌రికి క‌నెక్ష‌న్ క‌ట్ చేసేవారని కేసీఆర్ హ‌యాంలో మంచినీళ్లు ఉచితంగా మంచినీళ్లు అందిస్తున్నామని. కాంగ్రెస్, బీజేపీ నేత‌లు మాట‌లు ఉన్నారని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking