ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 09 (ప్రజాబలం) ఖమ్మం వివిధ అనారోగ్యాలతో బాధపడుతూ చికిత్సల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఆర్.ఎప్) కి రవాణా శాఖ మంత్రి సిఫార్సు మేరకు ధరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన ఆర్ధిక సహాయం గురువారం వి.డి.ఓస్ కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో 62 చెక్కులకు గాను రూ.25,13,500/-లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. నేటి వరకు 4117 లబ్ధిదారులకు రూ.17,96,09,650 కోట్లును పంపిణి చేసి వారిని ఆదుకోవడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ పునుకొలు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ డోరెపల్లి శ్వేత, వైస్ చైర్మన్ అఫ్టల్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.