విధుల్లో నిర్లక్ష్యంగా వివరించే జిహెచ్ఎంసి డాగ్ సెక్షన్ సిబ్బందిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వి నర్సింగరావు డిమాండ్ చేశారు బుధవారం మహారాజ్ గంజ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే అంబర్ పేట్ లో సామూహిక కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోకపోవడం విచారణకరమన్నారు జిహెచ్ఎంసి పరిధిలోని వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా దాగ్ సెక్షన్ ఓ అధికారి సర్కిళ్ల వారీగా కిందిస్థాయి సిబ్బంది వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు నగరంలోని ఉస్మానియా ,గాంధీ ,నీలోఫర్, కింగ్ కోటి ,ఈ ఎన్ టి, సరోజినీ , పేట్ల బురుజు ,కోటి ప్రసూతి ఆసుపత్రులు పరిసర ప్రాంతాల్లో కుక్కల స్వైర విరాహం చేస్తున్నాయని ఆహారం కోసం అన్వేషిస్తూ దొరకని పక్షంలో చిన్న పిల్లలపై ప్రతాపం చూపుతున్నాయని ఆయన అన్నారు డాగ్ సెక్షన్ సిబ్బంది క్షేత్రస్థాయి లో జన సమర్థం అధికంగా ఉండే ఎంజీబీఎస్, జేబీఎస్, గౌలిగూడ, సిబిఎస్ తదితర ప్రదేశాల్లో సంచరించే కుక్కలను నిర్వహించాలని ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు లేనిపక్షంలో పార్టీ తరఫున తీవ్ర ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు