విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న జహీరాబాద్ మండల ఎంఈఓ పై కఠిన చర్యలు తీసుకోవాలి

 

సంగారెడ్డి ఏప్రిల్ 24 ప్రజ బలం ప్రతినిది:
సోమవారం రోజున స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జహీరాబాద్ మండలం లో నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ పాఠశాల పట్ల ఉదాసీనంగా వ్యవహారించిన M.E.O పై శాఖ పరమైన చర్యలు కోవాలని కోరుతూ, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి కి వినిత పత్రం ఇవ్వడం జరిగింది *అనంతరం SC ST అట్రాసిటీ & మానిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ్ర ఇమ్మయ్య, దుర్గాప్రసాద్ టిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.వేణుగోపాల్, జన జాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ లు కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల.మాణిక్ సంయుక్తంగా మాట్లాడుతూ జహీరాబాద్ మండల పరిధిలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా నడుస్తున్న పాఠశాలలపై ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా, నిర్లక్యంగా వ్యవహరిస్తు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న MEO చర్యలు తీసుకోవాలని, మరియు గుర్తింపు లేకుండా నడుస్తున్న పాఠశాలలు, లైజియంసీబీఎస్ఈ స్కూల్ జహీరాబాద్ కోర్టులో కేసు పైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టులో కేసు వేసిన ఎంఈఓ మాత్రం ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే తాయిలలకు ఆశపడి అనుమతులు ఇస్తున్నారు. శాంతినికేతన విద్యాలయం స్కూల్ లో జూనియర్ కాలేజ్ స్కూల్ ఒకే బిల్డింగ్ లో నడిపిస్తున్నారు, శ్రీ చైతన్య స్కూల్, కమర్షియల్ బిల్డింగ్ లో ఫోర్త్ ప్లోర్లో నిబంధనల కు విరుద్ధంగా స్కూల్ నడిపిస్తున్నారు కింద పోర్షన్ లో బజాజ్ షోరూం బిల్డింగ్ ఉంది, బ్రిలియంట్ పబ్లిక్ స్కూల్, కమర్షియల్ బిల్డింగులు విద్యార్ధులకు ఏమాత్రం సేఫ్టీ లేకుండా రోడ్డు మీద స్కూల్ నడిపిస్తున్నారు. కింద షాపింగ్ మాల్ పైన స్కూల్ ఇది ఎలా సాధ్యం కనీసం పార్కింగ్ స్థలం కూడా లేదు విద్యా భారతి హై స్కూల్ ,గౌతమ్ మోడల్ స్కూల్ మోంటెశ్వరి స్కూల్, షైనీ గ్రూప్ ఆఫ్ స్కూల్, శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్, వెంకటేశ్వర హైస్కూల్, కనీసం పార్కింగ్ స్థలం లేకుండా గ్రౌండ్ లేకుండా ఒక పిఇటి లేకుండా స్కూలు నడిపిస్తున్నారు. జహీరాబాద్ లో కనీసం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం, గ్రౌండ్ లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న మానసిక ఒత్తుళ్లకు లోనవుతున్న పట్టించుకోవడం లేదు విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్న ఎంఈఓ నిమ్మకు నిరత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదు అంతేకాకుండా
గతంలో జహీరాబాద్ పట్టణంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయక ఎనిమిది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. తక్షణమే ఫిర్యాదుల పై నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎంఈఓపై చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్ధుల భవిష్యత్తు కాపాడాలని అన్నారు లేనిపక్షంలో ఉద్యమాలకు సిద్ధం కావాల్సింది అని అన్నారు ఈ కార్యక్రమంలో సురేష్, నవీన్, విజయ్ కుమార్, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు,

Leave A Reply

Your email address will not be published.

Breaking