ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతు వేదిక లో తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలోబుదవారం నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరంలో 28 వ సారి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన సుద్దపల్లి వేణుగోపాల్ ను జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్,తాసిల్దార్ జోష్ణ చేతిలో మీదుగా ప్రశంసా పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ… రక్తదాన శిబిరనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్,తాసిల్దార్ జోష్ణ కు ధన్యవాదాలు తెలియజేశారు.రక్త దానం చేయడం అంటే గొప్ప పని చేసినట్లు అని గుర్తించాలని అన్నారు.చాలా మంది రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.ప్రతి ఒక్కరూ రక్త దానం చేయడం వలన చాలా మంది ప్రాణాలు కాపాడినవారిగా నిలుస్తామని అన్నారు.రక్తదానం చేయడం గొప్ప సహాయంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ రక్తం స్వీకరించిన వ్యక్తికి రక్త దానం చేసిన వ్యక్తితో అనుకోకుండా రక్త సబంధం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.రక్తదాన శిబిరానికి యువత పెద్ద ఎత్తున రక్త దానం చేయుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని,ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన వ్యక్తిగా రక్త దానం చేసి జిల్లా వాసుల ప్రాణాలు కాపాడుటకు ముందుకు రావాలని కోరారు.రక్తం అవసరమైన వారిలో మన కుటుంబ సభ్యులు,బంధువులు, స్నేహితులు కూడా ఉంటారని పేర్కొన్నారు.అన్ని దానాలలోకి రక్త దానం గొప్పదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇన్చార్జ్ మహేందర్,ఏ ఓ ప్రభాకర్ రెడ్డి,మున్సిపల్ మేనేజర్ శ్రీహరి,రెవిన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది, వివిధ రకాల ఫర్టిలైజర్స్ యజమానులు,వివిధ రకాల కంపెనీ ఉద్యోగస్తులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.