తన పట్ల అభిమానం చూపిన నర్సింహులును ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే సునీత రెడ్డి.
కార్యకర్తలకు అండగా ఉంటా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి.
మెదక్ ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా శివంపేట మండలం
10 సంవత్సరాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివంపేట మండలం ఏదుల్లాపూర్ గ్రామానికి చెందిన పైనం నర్సింలు 2014ఎన్నికలో సునీత రెడ్డి ఓటమి చెందడంతో అప్పటి అప్పటినుంచి కాళ్లకు చెప్పులు ధరించలేదు సునీత రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించేంతవరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. 2024 లో ఆమె విజయం సాధించడంతో సోమవారం చెప్పులు ధరించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు పాదయాత్రగా మై మెదక్ జిల్లా శివంపేట్ మండల్ ఎదులాపూర్ గ్రామ పెద్దలు నరసింహులు బయలుదేరగా ఎమ్మెల్యే సునీత రెడ్డి ప్రారంభించారు. స్వామివారి దర్శనం అనంతరం నర్సింలు చెప్పులు ధరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎంపీపీలపోరం అధ్యక్షులు శివంపేట్ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు కల్లూరి హనుమంతరావు, తాజా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ అసోసియేషన్ సమన్వయకర్త డాక్టర్ కల్లూరి సంతోష్,
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్, మహేందర్ రెడ్డి , పైనం సందీప్, వెంకటేష్, నవీన్, పాండు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.