ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లాలో సంచలనం సృష్టించిన బిట్ కాయిన్/ క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ డా. ఏ. రవీందర్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
బిట్ కాయిన్/క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ప్రమేయం ఉండి, నిన్న పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించిన ఇద్దరు ఉపాధ్యాయులు బూస సాయికిరణ్, ఎస్జీటీ, ఎంపీపీఎస్ మొర్రిగూడ, కడెం మండలం మరియు కండెల నరేష్, ఎస్జిటి, ఎంపీపీఎస్ గంగాపూర్, కడెం మండలం నకు చెందిన ఉపాధ్యాయులిద్దరినీ, పోలీసు వారి రిమాండ్ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking