విద్యార్థుల భావి జీవితాల మార్గనిర్ధేశకులు ఉపాధ్యాయులే

We Serve
Together we can
CHANGING WORLD

మేము సేవచేస్తాము.అందరం కలిసి ప్రపంచాన్ని మార్చుదాం.
అనే ఆశయముతో ముందుకు సాగుతున్న మా ఇంటర్నేషల్ లయన్స్ క్లబ్ ఉద్యమములో బాగముగా మీరు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని,ఆవెలుగులలో విద్యార్థుల జీవితాలు మారతాయని తద్వార మన దేశ భవిష్యత్తును,ప్రపంచాన్ని మార్చగలుగుతామని
ఈ దిశగా ఆభగవంతుడు మీ అందరికీ ఎల్లవేలలా మార్గనిర్దేశము కావాలని
ముఖ్య అతిథి లయన్ పిల్లిగుండ్ల రాములుగౌడ్ pmjf అన్నారు.
డా.సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జన్మదినసందర్భముగా ఉపాధ్యాయదినోత్సవమును లయన్స్ క్లబ్ ఆప్ సంగారెడ్డి ఆదర్శ అద్వర్యములో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన సందర్భంగా ముఖ్య అతిధి దేశ అభివృధ్ధిలో ఉపాధ్యాయులు జాతినిర్మాతలని అన్నారు.
మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులకు ఆదర్శనీయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను సంగారెడ్డి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ సంగారెడ్డి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జే ఆర్ ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రాత్రి లయన్స్ క్లబ్ అధ్యక్షులు, ప్రోగ్రామింగ్ చైర్మన్ జూలకంటి ప్రభాకర్ అధ్యక్షతన, కో ప్రోగ్రామింగ్ చైర్మన్ శేషత్వం కృష్ణ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపిక చేసిన 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ చైర్మన్ రాములు గౌడ్, ప్రత్యేక అతిథిగా డిస్ట్రిక్ట్ చైర్మన్ శంకరి విజయేందర్ రెడ్డి, కార్యదర్శి లాడె మల్లేశం,కోశాధికారి యన్.రామప్ప, డిస్ట్రిక్ట్ చైర్మన్ అనంతరావ్ కులకర్ణి, మండల విద్యాధికారి కాండాపూర్ ఏ.భీంసింగ్, వ్యాఖ్యాత పూర్ణక్రిషచణ మరియు లయన్ సభ్యులు హన్మంత్ గౌడ్, రాంగోపాల్, సునీల్ కుమార్,శ్రీనివాస్ గౌడ్,
శ్రీధర్ రెడ్డి,లక్ష్మారెడ్డి,బి.శ్రీనివాస్, గురుపాదం, జి.భరతయ్య, ల తో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking