తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగావైభవంగా నిర్వహించాలి

 

ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రతినిత్యం ఆయా కార్యక్రమాలు జరపాలి

రాష్ట్ర దశాబ్ధి వేడుకలపై సన్నాహక సమావేశంలో రాష్ట్ర కార్మిక ,ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

సమావేశంలో పాల్గొన్న జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మే 27:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించాలని ఈ విషయంలో ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు అవసరమైన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, కూకట్పల్లి, కుత్భుల్లాపూర్, ఉప్పల్ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, కె.పి.వివేకానంద్గౌడ్, సుభాష్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు నందారెడ్డి, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, పాటు ఆయా శాఖల జిల్లా అధికారులతో రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలపై ఆయా శాఖలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళలోకి అడుగుపెడుతున్న శుభతరుణంలో ఈ ఉత్సవాన్ని పండగ వాతావరణంలో ఇరవై ఒక్క రోజుల పాటు రోజుకు ఒక శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు ఆయా శాఖలకు కేటాయించిన తేదీల్లో వారు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సంసిద్దంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేళ్ళకు ముందు పదేళ్ళ తర్వాత సాధించిన ప్రగతి, అభివృద్ధికి సంబంధించి ఫొటోలతో కూడిన స్టాళ్ళను ఏర్పాటు చేయాలని దీనివల్ల ఆయా రంగాల్లో ప్రభుత్వం పదేళ్ళ కాలంలో సాధించిన అభివృద్ధిని తెలియజేసిన వారమవుతామని మంత్రి సమావేశంలో వివరించారు. దీంతో పాటు కేవలం కలెక్టరేట్లోనే కాకుండా జిల్లాలోని పల్లెలు, గ్రామాలు, తండాల్లో కూడా అప్పటికీ ఇప్పటికీ ఉన్న అభివృద్ధి విషయాలను ప్రజలకు వివరించాలని అక్కడ కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలను పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో జరుపుకోవాలని సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని దీనికి పదేళ్ళలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమని దీనిని గుర్తించిన ఇతర రాష్ట్రాలు అక్కడ కూడా తెలంగాణా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయని ఈ విషయంలో రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని ఇది ఎంతో ఆనందకరమని మంత్రి మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇరవై ఒక్క రోజుల పాటు ఆయా శాఖలకు అప్పగించిన కార్యక్రమాలను ఎలాంటి లోటుపాట్లు రానివ్వకుండా జాగ్రత్తగా చేయాల్సిందిగా మంత్రి మల్లారెడ్డి సమావేశంలో కోరారు.

 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశ వివరాలను రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అనంతరం జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ తెలిపిన రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల వివరాలను మేడ్చల్ నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఇరవై ఒక్క రోజుల పాటు చేపట్టబోయే ఆయా కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు నందారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్ బెస్త వెంకటేశ్, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా అధికారులు కు ముందస్తు సన్నాహక సమావేశాలు నిర్వహించాం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,
రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటికే అప్రమత్తం చేశామని ఈ విషయంలో ఆయా శాఖలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై గతంలో సమావేశాలు నిర్వహించి దిశానిర్ధేశం చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డి, కూకట్పల్లి, ఉప్పల్, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యేలు కృష్ణారావు, సుభాష్రెడ్డి, వివేకానంద్తో పాటు జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు ఇప్పటికే జిల్లాలోని అన్ని శాఖల వారికి వారు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించామని అందుకు సమావేశాలు సైతం ఏర్పాటు చేసి ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించినట్లు కలెక్టర్ అమోయ్కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ విషయంలో ఎప్పటికప్పుడు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులకు అవసరమైన సూచనలు చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం సూచించినట్లుగా ఎలాంటి లోటుపాట్లకు, ఇబ్బందులకు తావులేకుండా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల ప్రారంభోత్సవం రోజు నుంచి పూర్తయ్యే చివరి రోజు వరకు తాను స్వయంగా పర్యవేక్షిస్తానని కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి 21వ రోజుల పాటు అంటే జూన్ 22వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి వేడుకలకు సంబంధించి ఆయా రోజుల్లో నిర్వహించే రోజు వారి కార్యక్రమాల వివరాలను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు.
+ జూన్ 2వ తేదీన (శుక్రవారం) : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండల కేంద్రంలో ఉన్న అమరనవీరుల స్థూపం వద్ద రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నివాళులర్పిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో పతాకావిష్కరణ చేసి రాష్ట్ర దశాబ్ధి ఉత్సవ సందేశాన్ని అందచేసి తదితర కార్యక్రమాలు చేపడతారు
+ – జూన్ 3వ తేదీ (శనివారం) :- తెలంగాణ రైతు దినోత్సవం, ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశం. జాతీయగీతాలాపనతో ప్రారంభించాలి. రైతు వేదికలను మామిడి తోరణాలు, పువ్వులు, సీరియల్ బల్బులతో అద్భుతంగా అలంకరించాలి. రైతు వేదికల ప్రాంగణాల్లోనూ, హాల్లోపల కూడా రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై ప్లెక్సీలు,, పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల విశిష్టతను తెలియచేసే విధంగా ఉండాలి. సభలో రైతుబంధు సమితుల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, పీఏసీఎస్ ఛైర్మన్లు, వ్యవసాయ, హార్టికల్చర్, మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు, నాయకులు అందరూ పాల్గొనాలి. పాంప్లెట్ లో వ్యవసాయరంగంలో జరిగిన సంపూర్ణ ప్రగతిని వివిధ పథకాలు (ఉచిత విద్యుత్తు, రైతుబందు మొదలైన వాటికింద) ఒక్కో రైతుకు కలిగిన లబ్దిని వివరించాలి. ఆక్లస్టర్ లోని గ్రామాలకు వ్యవసాయశాఖ ద్వారా వచ్చిన నిధుల గురించి వివరించాలి. పాంప్లెట్లు సభలో ఆవిష్కరించాలి. పంచాలి. సభలో చదవాలి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ కరపత్రం, బుక్ లెట్, పోస్టర్ల వంటి సమాచార సామగ్రిని తయారు .చేసి, కలెక్టర్లకు పంపిస్తుంది. వీటిని ప్రతి రైతుకు అందేలా పంపిణీ చేయాలి. రైతు బీమా లబ్దిదారులతో వారి కుటుంబానికి కలిగిన మేలును గురించి సభలో మాట్లాడించాలి. . వ్యవసాయ కళాశాలల్లోనూ ప్రత్యేక రైతులందరితో సామూహిక భోజనం.చేసి కలెక్టర్లకు పంపిస్తుంది. వీటిని ప్రతి రైతుకు అందేలా పంపిణీ చేయాలి. రైతు బీమా లబ్దిదారులతో వారి కుటుంబానికి కలిగిన మేలును గురించి సభలో మాట్లాడించాలి.. వ్యవసాయ కళాశాలల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. – రైతులందరితో సామూహిక భోజనం చేయాలి.
+ జూన్ 4వ తేదీ (ఆదివారం) : సురక్షా దినోత్సవం. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షనకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను, వివరించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి. పోలీసు శాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను సభలో, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయడంలో తెలంగాణ పోలీస్ గత 8 సంవత్సరాలుగా దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిన విషయాన్ని హైలైట్ చేయాలి. ఈ విధంగా పోలీసుశాఖ సాధించిన ఘనతలను, విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలి. అనంతరం పెట్రోలింగ్ కార్స్, బ్లూ కోట్స్, ఫైర్ వెహికిల్స్ తదితరాలతో ర్యాలీ నిర్వహించాలి. సాయంత్రం ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది సభ నిర్వహించి సామూహిక భోజనం ఏర్పాటు చేయాలి
+ జూన్ 5వ తేదీ (సోమవారం) :- జిల్లా, మండల స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్తు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో వెయ్యి మందితో సమావేశం నిర్వహించాలి. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లను, ఇతర విద్యుత్ కార్యాలయాలను సీరియల్ బల్బులతో 21 రోజుల పాటు ఉండాలి, పూల తోరణాలతో అద్భుతంగా అలంకరించాలి. ప్రతి గ్రామంలో విద్యుత్తు గురించిన ఆకర్షణీయమైన ఫ్లెక్సీ‘‘ నాడు – నేడు” పద్ధతిలో ఏర్పాటు చేయాలి. విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను గురించి బుక్ లెట్ తయారు చేసి, విస్తృతంగా పంపిణీ చేయాలి. గతంలో కరెంట్ కోతల దుస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత ‘‘వెలుగు… జిలుగుల” రాష్ట్రంగా – మారిన విషయంతో పాటు… గ్రామంలో ఉన్న మొత్తం కనెక్షన్లు, – తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన కొత్త కనెక్షన్లు, – ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల వివరాలు, రైతులకు జరుగుతున్న మేలు, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు ఇస్తున్న విషయం, దానివల్ల వివిధ వృత్తులు, వ్యాపార వ్యవహారాలు సజావుగా నడవడం, గ్రామీణ జీవితంలో వచ్చిన సౌకర్యం తదితర అంశాలను పొందుపరచాలి. సోలార్, హైడల్, థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా పెరిగిన తీరును హైలేట్ చేయాలి. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసిన తీరును, దీనికోసం చేసిన ఖర్చు, తదితర వివరాలను వెల్లడించాలి. విద్యుత్తు సిబ్బందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహఙంచి కార్మికులతో సామూహిక భోజనాలు చేయాలి.

+ జూన్ 6వ తేదీ (మంగళవారం) : తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహించాలి. ఈ సభలో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని ప్రకటించాలి. టీఎస్– ఐపాస్ పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాన్ని ప్రస్తావించాలి. తద్వారా రాష్ట్రానికి తరలివచ్చిన పెట్టుబడుల వెల్లువకు సంబంధించిన వివరాలను, తద్వారా పెరిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాల వివరాలు ప్రకటించాలి. పాంప్లెట్లు ప్రచురించి పంచాలి. టీ హబ్, వీ హబ్లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సమావేశం నిర్వహించాలి. ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్, బెంగళూరును అదిగమించి దేశంలోనే నెంబర్– 1 గా నిలిచిన తీరును ఆవిష్కరించాలి

+ జూన్ 7వ తేదీ (బుధవారం) :- సాగునీటి దినోత్సవం, సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో 1000 మందితో సభ. ఈ సభలో రైతులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొనాలి. జిల్లాలో, నియోజకవర్గంలోనూ ఇరిగేషన్ రంగంలో జరిగిన ప్రగతిని వివరించాలి. అత్యధికశాతం నిధులు వెచ్చించి, బృహత్తరమైన ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించిన విషయం వెల్లడించాలి. జిల్లాలో చెక్డ్యామ్లు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన విషయం తెలియజేయాలి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు, ప్రజాప్రతినిధులతో కలిసి శామీర్పేట చెరువు వద్ద సమావేశం నిర్వహించాలి.

+ జూన్ 8వ తేదీ (గురువారం) :- ఊరూరాచెరువుల పండుగ… గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహించాలి. గ్రామం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్య కారుల వలలతో ఊరేగింపుగా బయలుదేరాలి. గ్రామంలోని రైతులు, మత్స్య కారులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు చెరువు కట్టకు చేరుకోవాలి. చెరువు కట్టపై పండుగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించాలి. కట్ట మైసమ్మపూజ ,- చెరువు నీటికి పూజ చేయాలి. తదనంతరం సభ, సాంస్కృతిక కార్యక్రమాలు ,- బతుకమ్మ, కోలాటాలు – పాటలు, గోరేటి వెంకన్న రాసిన ‘‘చెరువోయి.. మా ఊరి చెరువు” తదితర చెరువు పాటలు వినిపించాలి. ఇరిగేషన్ లో వచ్చిన ప్రగతి, తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్స్య సంపద, భూగర్భ జలాల పెరుగుదల.. తదితర వివరాలను తెలియజేస్తూ, ఫ్లెక్సీలు పెట్టాలి – పాంప్లెట్లు పంచాలి చదివి వినిపించాలి..నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్ట మీద సహపంక్తి భోజనాలు చేయాలి.

+ జూన్ 9 (శుక్రవారం) :- తెలంగాణ సంక్షేమ సంబురాలు, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులతో వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా సభ నిర్వహించాలి. ఆ నియోజకవర్గంలో ఎంత మంది పించన్లు, కల్యాణలక్ష్మి, తదితర సంక్షేమ పథకాల లబ్ది పొందారు, ఇందుకోసం ఎన్ని నిధులు వెచ్చించారు. దాని ఫలితాలు గురించి వివరించాలి. తాము పొందిన లబ్ధి గురించి లబ్ధిదారుల చేత మాట్లాడించాలి. జిల్లాలో అమలైన అన్ని సంక్షేమ కార్యక్రమాల వివరాలు, లబ్ధిదారుల సంఖ్య, ఇందుకోసం వెచ్చించిన నిధుల వంటి పూర్తి వివరాలు తమతమ ప్రసంగాల ద్వారా సభలో ఆవిష్కరించాలి. మంత్రలు, ఆ శౄఖ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. అలాగే గతంలో భూములు సేకరించిన చోట, అందుబాటులో ఉన్న చోట అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలి, వివిధ గ్రామీణ వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ కింద లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం.
+ – జూన్ 10వ తేదీ, శనివారం : తెలంగాణ సుపరిపాలన దినోత్సవం. పరిపాలన సంస్కరణలు, ఫలితాలు అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రము ఖంగా ప్రస్తావించాలి. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరినీ భాగస్వామ్యం చేయాలి. ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు తదితర వివరాలతో కరపత్రం తయారు చేసి పంపిణీ చేయాలి. వీటివల్ల ప్రజలకు దూరభారం తగ్గడమే కాకుండా, పరిపాలన పరమైన పర్యవేక్షణ సులభతరమైన విషయాన్ని పేర్కొనాలి. వివిధ శాఖలను పునర్ వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్నవిషయాన్ని వివరించాలి. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, హెల్త్, విద్యుత్తు, రెవెన్యూ. మున్సిపల్ తదితర శాఖల పునర్ వ్యవస్థీకరించిన తీరుతెన్నులను, తద్వారా పరిపాలన సుగమమై ప్రజలకు చక్కని సేవలు అందుతున్న విధానాన్ని, వీటి ప్రభావంతో ప్రజాజీవితంలో వచ్చిన మెరుగుదలపై నివేదిక తయారు చేయాలి. నూతనంగా ఏర్పడిన మండలాలు, మున్సిపాలిటీల్లో సంబురాలు జరిగేలా స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకోవాలి.

+ జూన్ 11వ తేదీ, ఆదివారం: తెలంగాణ సాహిత్య దినోత్సవం. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ కవులు, సాహిత్యాభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా కవితలు ఉండాలి. జిల్లాస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కవితా సంకలనం ప్రచురించాలి.

+ – జూన్ 12వ తేదీ సోమవారం :తెలంగాణ రన్…. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్ధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించాలి. ఈ రన్ కార్యక్రమం పోలీసు శాఖ నేతృత్వంలో జరుగుతుంది. క్రీడలు, యువజన సర్వీసులశాఖ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి.ఈ సందర్భంగా ప్రత్యేకంగా బెలూన్స్ ఎగురవేయాలి.

+ జూన్ 13 కార్యక్రమం మంగళవారం :- తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నియోజకవర్గం కేంద్రంలో మహిళా సదస్సు నిర్వహించాలి. ఈ సదస్సులో ఆంగన్వాడీ టీచర్లు, సెర్ఫ్ సిబ్బంది, ఇతరులు మొత్తం 1000 మందికి తగ్గకుండా పాల్గొనేలా చూడాలి. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరించాలి. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీఎల్గర్, షీ టీమ్స్, వీ హబ్ ఏర్పాటు, మహిళా.. ఉద్యోగుణులకు ప్రసూతి సెలవులు పెంచిన విషయం తదితర విషయాలన్నింటిని ఘనంగా పేర్కొనాలి. అంగన్ వాడీలకు, ఆశా వర్కర్లకు ఇతర మహిళా ఉద్యోగులకు వేతనాలు పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి. మహిళా డిగ్రీ కళాశాలలను విరివిగా ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించాలి.మహిళలతో ఎక్కువగా మాట్లాడించాలి. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేయాలి. ఈ సమావేశంలో మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులందరూ పాల్గొనాలి.

+ జూన్ 14 కార్యక్రమం, బుధవారం : తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం నియోజకవర్గ జిల్లా స్థాయిలో కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, నూతన మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీల విద్యార్థులు తదితరులను ఆహ్వానించి సభ నిర్వహించాలి. అందులో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని పేర్కొనాలి. మెడికల్ కాలేజీలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానాలు, కంటి వెలుగు, న్యూట్రీషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, ఎంసీహెచ్ లు, మాతా శిశు సంరక్షణ సేవలు, పెరిగిన మౌలిక వసతులు వంటి పూర్తి వివరాల గురించి వివరించాలి. వైద్యారోగ్య రంగంలో సాధించిన సంపూర్ణ ప్రగతిని తెలియజేస్తూ, ఆ శాఖ ఒక కరపత్రాన్ని రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయాలి. ఉత్తమ ఆశా వర్కర్, ఉత్తమ ఏఎన్ఎం, ఉత్తమ స్టాఫ్ నర్స్, ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్, ఉత్తమ డాక్టర్లకు సన్మానం చేయాలి. అవార్డులు అందించాలి.

+ జూన్ 15 గురువారం : తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం, ప్రతి గ్రామ పంచాయతీ ముందు జాతీయ జెండా ఎగురవేయాలి. అనంతరం పల్లె ప్రగతి ద్వారా, గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని, గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి. గ్రామ పారిశుద్ధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి. జాతీయ స్థాయిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలి. నాడు -– నేడు ఫార్మాట్ లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి మరియు పంచాయతీరాజ్ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో ఊరూరా ఫ్లెక్సీలు పెట్టాలి. ఊరిలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఫ్లెక్సీలు పెట్టాలి.. ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారుచేసి పంచాలి. ఈ సమావేశంలో పల్లెప్రగతి విజయాలను, జాతీయ స్థాయిలో సాధించిన అవార్డులను పేర్కొనాలి. పారిశుద్ధ్యం మెరుగు పడటం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గిపోయిన తీరును ప్రముఖంగా ప్రస్తావించాలి. గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగిన తీరును ప్రస్తావించాలి.ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం. చేయాలి.

+- జూన్ 16వ తేదీ శుక్రవారం:- తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం,
ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయాలి. అనంతరం పట్టణ ప్రగతి ద్వారా, పట్టణానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్దిని, పట్టణంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటిం చాలి. పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి. జాతీయ స్థాయిలో పట్టణాభివృద్ధిలో సాధించిన ఆవార్డుల వివరాలను తెలియజేయాలి. వివిధ పట్టణాల్లో నిర్మించిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల గురించి, వైకుంఠధామాల నిర్మాణం గురించి, డంప్ యార్డుల గురించి, అర్బన్ ఫారెస్ట్, పార్కుల నిర్మాణం, 10 శాతం.. గ్రీన్ బడ్జెట్గా కేటాయించడం తదితర అభివృద్ధి అంశాల గురించి ప్రస్తావించాలి. నాడు -– నేడు ఫార్మాట్ లో పట్టణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి, పురపాలక శాఖ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో పట్టణాల్లో ఫ్లెక్సీలు పెట్టాలి. ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారుచేసి పంచాలి. మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించిన తీరు. ఉచితంగా తాగునీటి సరఫరా వివరాలను తెలియజేయాలి. దేశానికే దిక్సూచీగా టీఎస్ బీపాస్ చట్టం తీసుకొచ్చిన సంగతి. తద్వారా సులువైన నిర్మాణ అనుమతుల ప్రక్రియ వంటి అంశాలను హైలైట్ చేయాలి. జీవో 58, 59 తదితర జీవోల ద్వారా పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు అందజేసిన విధానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాలి. ఉత్తమ మున్సిపాలిటీల, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లకు, ఛైర్మన్లకు, మేయర్లకు, ఉద్యోగులకు సన్మానం చేయాలి.

+ – జూన్ 17వ తేదీ శనివారం :- తెలంగాణ గిరిజనోత్సవం,
ఆయా గిరిజన గ్రామాల్లో సభలు గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించాలి… గిరిజనుల చిరకాల వాంఛను తీరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి తీరును, విద్య, ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్ 10 శాతం పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి. హైదరాబాద్ లో బంజారా భవన్, ఆదివాసి భవన్ నిర్మాణం చేసిన విషయం హైలైట్ చేయాలి. కుమ్రంభీం జయంతిని, సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ప్రకటించాలి. సమ్మక్క – సారక్క జాతరను రాష్ట్ర జాతరగా నిర్వహిస్తున్న తీరును, అందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న తీరును ప్రస్తావించాలి. వివిధ జాతరలకు ప్రభుత్వ ఆర్థిక సాయం చేస్తున్న తీరును, తదితర వివరాలను వెల్లడించాలి.

+ – జూన్ 18వ తేదీ ఆదివారం : తెలంగాణ మంచి నీళ్ల పండుగ…
ప్రజా ప్రతినిధులు, విద్యార్ధులు, పాత్రికేయులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సందర్శన కార్యక్రమం నిర్వహించాలి. నీళ్లను శుభ్రపర్చుతున్న తీరును వివరించాలి. ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా అవుతున్న తీరును వివరించాలి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో భయంకరమైన తాగునీటి ఎద్దడి ఉన్న తీరును ప్రస్తావిస్తూ, మిషన్ భగీరధ ద్వారా ఆ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించిన విధానాన్ని అద్భుతంగా తెలియజేయాలి. గ్రామంలోని మహిళలతో సభ నిర్వహించాలి. గతంలో మంచినీటి కోసం పడ్డ కష్టాలను, బిందెడు నీళ్ల కోసం వీధి పోరాటాలు చేయాల్సి వచ్చిన దుస్థితిని ప్రస్తావించాలి. మిషన్ భగీ ద్వారా ఇంటింటికి ఉచితంగా నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించాలి…తాగునీటి కష్టాలు సంపూర్ణంగా తీరిపోయి, మహిళలు సంతోషిస్తున్న విధానాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగులందరినీ భాగస్వామ్యం చేయాలి. మిషన్ భగీరథ విజయాలను విశేషంగా తెలియజేయాలి.
+ జూన్ 19వ తేదీ సోమవారం :- తెలంగాణ హరితోత్సవం,
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలి. నర్సరీలను సందర్శించాలి. మొక్కలు నాటే కార్యక్రమం (మాస్ ప్లాంటేషన్) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లోనూ విధిగా నిర్వహించాలి. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని వివరించాలి. అడవుల పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాల గురించి వివరించాలి. గ్రీన్ కవర్ పెంచడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని వెల్లడించాలి. హైదరాబాద్ కు గ్రీన్ సిటీ, ఇతర అవార్డులు వచ్చిన తీరును వివరించాలి.

+ జూన్ 20వ తేదీ మంగళ వారం: తెలంగాణ విద్యాదినోత్సవం…
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు, అన్ని గురు కుల పాఠశాలలు, వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తదితర అన్ని విద్యాసంస్థల్లో ఉదయం పతాక వందనం చేయాలి. తదనంతరం సభలో విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను పేర్కొనాలి. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మనఊరు – మన బడి పాఠశాలల ప్రారంభోత్సవం నిర్వ హించాలి. సిద్ధంగా ఉన్న పది వేల గ్రంథాలయాలను, 1,800 డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ప్రారంభించాలి. పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో, పూలతో అందంగా అలంకరించాలి.విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో పాటు, 1001 గురుకులాల స్థాపన, నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటు (హార్టిక ల్చర్, ఫారెస్ట్, మహిళ, హెల్త్ యూనివర్సిటీ, తదితర) జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వ మెడి కల్ కాలేజీల ఏర్పాటు,, నూతనంగా నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు (రెసిడెన్షియల్ తో సహా), డిగ్రీ కాలేజీల (రెసిడెన్షియల్ తో సహా) ఏర్పాటు తది తర వివరాలను వెల్లడించాలి. –
+ జూన్ 21వ తేదీ బుధవారం: తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం, దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్ధనా మందిరాలకు అలంకరణ, దేవాలయాల్లో వేద పారాయణం, మసీదులు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్ధనలు, ప్రముఖ క్షేత్రాల్లో ప్రత్యేక భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు. హరికథలు, పురాణ ప్రవచనాలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ విధిగా పాల్గొనాలి.

+ జూన్ 22 తేదీ (గురువారం) : అమరుల సంస్మరణ…
ఊరూరా గ్రామ పంచాయతీలు ఉదయం 11 గంటలకు సమావేశం కావాలి. అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాలి. అమరుల సంస్కరణ తీర్మాణం చేయాలి.. ఇదే విధంగారాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులలో శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించాలి. నిర్ణీత ఫార్మాట్లో అమరుల సంస్కరణ తీర్మానాలు చేయాలి. రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో ప్రార్ధనా సమావేశంలో అమరుల స్మృతిలో 2 నిమిషాలుమౌనం పాటించాలి. వారి త్యాగాలను గురించి ప్రస్తుతించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించాలి. అనంతరం కళాకారుల ర్యాలీ నిర్వహించాలి. అనితెలిపినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking