సజావుగా సాగుతున్న ‘పది’ పరీక్షలు

— జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని సందర్శన

స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాల మెదక్ లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలోకి వెళ్లి పరీక్షలు కొనసాగుతున్న తీరును వారు పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు పరిశీలించి, అధికారులు పలు సూచనలు చేశారు.
పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట మెదక్ తహశీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking