బస్సు రావడం చాలా సంతోషకరమైన శుభవార్త

మనికొండ ప్రజాబలం ప్రతినిధి:మనికొండమనికొండ చిత్రపురి కాలనీ ఎల్‌ ఐ జీ నుండి బయలు దేరి ఎం ఐ జీ ఎదురుగుండా ల్యాంకో హిల్స్‌ మీదగా మణికొండ, ఓ యు కాలనీ, ఫిల్మ్‌ నగర్‌ నుండి సికింద్రాబాద్‌ స్టేషన్‌ వరకు టీ ఎస్‌ ఆర్‌ టీ సీ బస్సు రావడం చాలా సంతోషకరమైన శుభవార్త, ఈ బస్సు రావడానికి కృషి చేసిన కౌన్సిలర్లు వల్లభనేని హైమాంజలి అనిల్‌ కుమార్‌, వసంతరావు చౌహన్‌ మరీ ముఖ్యంగా రాజేంద్ర నగర్‌ ఎం ఎల్‌ ఏ ప్రకాష్‌ గౌడ్‌ చొరవతో మనకు బస్సు సౌకర్యం రావడం జరిగినది. ఈ విషయమై సహకరించిన కంటోన్మెంట్‌ ఆర్‌ టి సి డిపో మేనేజర్‌ రామ్‌ మోహన్‌, మనికొండ బీ ఆర్‌ ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ రామ కృష్ణ రెడ్డి మరియు తీవ్ర కృషి చేసిన ఓనర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులకు అందరికి చిత్రపురి కాలనీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేయడం జరిగినది.
బస్సులు బయలుదేరు సమయములు.
ఉదయం 5.30 నిముషాలకు, 8.30 నిముషాలకు, సాయంత్రం 4.30 మరియు 7.30 నిముషాలకు ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్క పౌరుడు ఉపయోగించు కొనగలరని కోరుచు, మరికొన్ని ఏరియాలకు కూడా బస్సు సర్వీస్‌ లు నడపడానికి ప్రయత్నం చేస్తామని ఆర్‌ టీ సీ అధికారులు తెలియ పరచారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్‌ ఐ జీ, హెచ్‌ ఐ జీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులకు, కాలనీ వాసులకు బీ ఆర్‌ ఎస్‌ పార్టీ నాయకులకు తదితరులకు చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్‌ కుమార్‌ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి పీ ఎస్‌ ఎన్‌ దొర ధన్యవాదములు తెలియ పరచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking