జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 01 : లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్,జూన్ 4న కౌంటింగ్ ఉన్నందున ఎన్నికల నిర్వహణలో ప్రవర్తన నియమాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ,డిగ్రీ కళాశాలలో పిసైడింగ్ అధికారులు,సహాయక ప్రిసైడింగ్ అధికారులు,ఇతర ప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి, 004-మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వి రాములు తో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశం పై అప్రమత్తంగా ఉండాలని,ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా విందులు నిర్వహించాలని తెలుపారు.ప్రిసైడింగ్ అధికారులు,సహాయక ప్రిసైడింగ్ అధికారులు తమ కు అందించిన హ్యాండ్ బుక్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల నిర్వహణ, పొలింగ్, కౌంటింగ్ కార్యక్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని,పోలింగ్ రోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో ఇబ్బంది తలెత్తినట్లయితే వెంటనే చర్యలు తీసుకోవాలని,ఫారం-12 డి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియను పరీక్షించాలని తెలిపారు.

పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గం లోని జిల్లాలో 002-చెన్నూర్ ఎస్ సి శాసనసభ నియోజకవర్గంలోని 227,003- బెల్లంపల్లి ఎస్ సి శాసనసభ నియోజకవర్గంలో 227,004- మంచిర్యాల శాసనసభ నియోజకవర్గంలో 287 మొత్తంగా 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రిసైడింగ్, సాహాయ ప్రిసైడింగ్ అధికారులు,తమ పరిధిలో పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.జిల్లా లో లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యత యుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. అనంతరం బ్యాలెట్ యూనిట్లు,కంట్రోల్ యూనిట్లు, వి.వి ప్యాట్ల పనితీరు వివరించడంతోపాటు పోలింగ్ ప్రక్రియ కు సంబంధించిన ఫారములు నింపే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారులు,సహాయ ప్రిసైడింగ్ అధికారులు,ఇతర ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల విభాగం అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.