రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగాభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం. -విద్యార్థి ఉద్యమాలను ఉదృతం చేస్తాం

-పి.డి.ఎస్.యు. యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్. నాగేశ్వరరావు

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా జూలై 27:తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్య రంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా విద్యారంగా అభివృద్ధిని రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, విద్య రంగాన్ని పరిరక్షించుకోవడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని పి.డి.ఎస్.యు. యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్. నాగేశ్వర్ రావు విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ ఆఫీసులోనీ రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పి.డి.ఎస్.యు.తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు పి.రామకృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి విచ్చేసిన ఎస్.నాగేశ్వర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా విధ్వంసానికి గురైన విద్యారంగాన్ని గాడిలో పెట్టి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అరకొరగా 7.3% నిధులు కేటాయించడం విద్యారంగాన్ని విస్మరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయలలో విద్యా ప్రమాణాలు దెబ్బతిని పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందనీ అన్నారు.విద్యారంగానికి కేటాయించిన నిధులు విద్యాసంస్థల నిర్వహణకు, టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బంది జీతభత్యాలకు మాత్రమే సరిపోతాయి తప్ప విద్యారంగ నాణ్యత ప్రమాణాలు,పరిశోధనల అభివృద్ధికి ఏమాత్రం సరిపోవని అన్నారు.గత మూడు సంవత్సరాలుగా విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్,మెస్,కాస్మోటిక్ చార్జీలు తక్షణమే విడుదల చేయాలని, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ కు,ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్స్ కు స్వంత భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సమస్యలకు నిలయాలుగా మారిన ప్రభుత్వ యూనివర్సిటీలు, కళాశాలలు,సంక్షేమ హాస్టల్స్, గురుకులాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.లేనియెడల విద్యార్థి పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. ఆజాద్,రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహా రావు,కాంపాటి పృద్వి, సహాయ కార్యదర్శి ప్రవీణ్,కోశాధికారి సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్,సుమంత్,గణేష్,అనిల్, నరేందర్,సతీష్,తిరుపతి,రాకేష్, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking