రాష్ట్ర బీసీ కమిషన్ లో ఘనంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు.

హైదరాబాద్ జూన్ 2);రాష్ట్రం 10 ఏళ్లలోనే ఊహించని ప్రగతిని సాధించిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ప్రభుత్వం సగర్వంగా నిర్వహిస్తున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు చరిత్రలో మరుపురాని మధుర ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు.రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల లో భాగంగా ఖైరతాబాద్ లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, కె కిషోర్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking