రాజ్యాధికారం ద్వారానే బహుజనుల అభివృద్ధి

బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ ఆగష్టు 30 ();రాజ్యాధికారం కోసం బహుజనులు ఏకం కావాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుదవారం దళిత జన సమితి (డిజేఎస్ )బృందం హైదరాబాద్ లోని బిసి భవన్ లో ఆర్.కృష్ణయ్యను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ దెశ్క జనాబాలో 80 శాతం జనాబా ఉన్న దళిత బహుజనులు రాజ్యాధికారం లోకి వచ్చినపుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లని అన్నారు. 75 సంవస్సరాల స్వతంత్ర చరిత్రలో దళిత బహుజనుల బ్రతుకులు ఎక్కడివేసిన గొంగడి అక్కడిలాగే ఉన్నాయని 2,3 శాతం జనాబా లేని అగ్రకులాలు ఆదిపత్యం చలాయిస్తూ అనగ ద్రోక్కుతున్నాయని విమర్శించారు. రాజ్యాధికారంద్వారానే బహుజనులు అభివృద్ధి చెందుతారని, తద్వారా దేశం మరింత అభివ్రుద్ధి ఫతంలో ముందుకు వెళుతుందని అన్నారు. దళిత జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండె సంపత్ మాట్లాడుతూ, తెలంగాణలో రానున్న రెండు నెలల్లో ఎలక్షన్స్ నిర్వహణ ఉన్నందున అధికార పార్టీ బిఆర్ఎస్ వాళ్లు బహుజనులను పట్టించుకోకుండా సీట్ల పంపకాల్లో అవమానించడం జరిగింది. కావున మనకు జరుగుతున్న అన్యాయం గురించి మన హక్కుల గురించి, వారితో మాట్లాడుతూ, ఇకనైనా బహుజన బిడ్డలు ఏకమై రాష్ట్ర రాజకీయాల్లో మన ఓటు యొక్క విలువ తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మన హక్కులు మనము కాపాడుకోడానికి సంఘటితమై ముందుకు వెల్లాలన్నారు.అహంకార పూరితంగా టిక్కెట్ల కేటాయింపులో భాగంగా అధికార పార్టీకి మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈకార్యక్రమంలో డిజేఎస్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ రాకేష్, రాష్ట్ర కన్వీనర్ రమేష్ ,రాష్ట్ర కార్యదర్శి భానులపల్లి గంగాధర్, మరియు కార్యవర్గ సభ్యులుఇప్పల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking