అభివృద్ధికి అబద్ధాల కు మధ్య జరుగుతున్న ఎన్నికల సమరభేరి”

కారు గుర్తుకు ఓటేసి బి.అర్.ఎస్ కు పూర్వవైభవం తెద్దాం

మెదక్ జిల్లా ప్రతినిధి. తూప్రాన్, మే, 9. ప్రజాబలం న్యూస్ :-

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధికి అబద్దాలకు మధ్య నడుస్తున్న సమరభేరి అని తూప్రాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ అన్నారు. గురువారం తూప్రాన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు సరఫ సతీష్ చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపు ఇప్పటికే ఖాయమైందని అన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు కేసీఆర్ చేసిన పథకాలు అభివృద్ధి కనపడుతుందని అన్నారు. తూప్రాన్ మున్సిపల్ అభివృద్ధి కేవలం కెసిఆర్ హరీష్ రావు సహకారంతో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పి ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు చెప్పి ఐదు ఇచ్చాం అని ఉత్తర ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. ఒక్కటే అడుగుతున్న మహిళలకు తులం బంగారం, 2500 నగదు, 500 కే గ్యాస్ ఇస్తామని హామీలు ఇచ్చి మొండి చేయి చూపారన్నారు. అనంతరం తూప్రాన్ మున్సిపల్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు షరాఫ్ సతీష్ చారి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె శ్రీనివాస్ నేడు వెంకట్రాం రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వచ్చి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు రివర్స్ అయ్యారని మొన్నటిదాకా బాగా ఉండే కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించి మోసపోయామని ప్రజలు అంటున్నారని తెలిపారు. మంచిగా కరెంటు నీరు వచ్చేదని ప్రస్తుతం రావడంలేదని అన్నారు. వాగులో ఎప్పటికీ నీరు ఉండేదని పదేళ్ల పాలనలో కనివిని ఎరగని విధంగా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. తూప్రాన్ అభివృద్ధికి హరీష్ రావు కేసీఆర్ చెప్పగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధి పథంలో నడిపారు అన్నారు. గతంలో ఇచ్చిన పథకాలు పూర్తిగా రద్దుచేసి కొత్తవి ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అందుకే సమర్థవంతునిగా పనిచేసే వెంకటరామిరెడ్డిని బలపరిచి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సతీష్ చారి మన్నే శ్రీనివాస్ ప్రజలను కోరారు.


ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సరాఫ్ సతీష్ చారి, జెడ్పిటిసి బసవన్న గారి సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ ,పల్లె ప్రభాకర్ రెడ్డి, కిష్టాపురం కృష్ణారెడ్డి, ఎండి రహీం, బాబుల్ రెడ్డి, ఎస్ కె సత్తార్, మామిడి మహేష్ , పసుల నారాయణ, సత్యలింగం, శ్యాంసుందర్ రెడ్డి, ఆర్ అంజాగౌడ్, పసుల జయరాం, పసుల విజయ్, టైలర్ నాగరాజ్, మొహమ్మద్ హుస్సేన్, బాయికాడి ఆంజనేయులు, తుమ్మల మల్లేష్, బందెల నరేష్, మామిండ్ల అనిల్ , గంగాధర్ వెంకటేష్, రవి , దాసరి ఆంజనేయులు, సిండే చంద్రం, మామిండ్ల అనిల్ కుమార్, జి అచ్యుత్ రెడ్డి, తాటి లచ్చల్, తాటి విశ్వం, బొడ్డు రమ్య శ్రీహరి, సలాక రాజు శర్మ, బ్రిటానియా బిస్కెట్ కృష్ణ, చిన్న లింగ్ మల్లికార్జున్ గౌడ్, మాలే కుమార్ గుప్త, కాయితిబాపని శివ, జంగం రాములు, కుమ్మరి జయరాం, సత్తయ్య, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking