నిర్మల్ జిల్లాలో మొదటి కేసు లక్ష్మణ్ చందా పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

జూలై 1 అనగా ఈ రోజు నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి వచ్చినట్లు జిల్లా ఎస్పి.పేర్కొన్నారు.
ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం,బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు.ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు,విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని,ప్రజలకి మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు.భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం.

కొత్త చట్టాల ప్రకారం జిల్లలో మొదటి కేసు చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి

నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్ (వడ్యాల్) గ్రామానికి చెందిన దేశ బోయిన పోశెట్టి అను వ్యక్తి 01 జూలై రోజు ఉదయం నర్సాపూర్ (వడ్యాల్) చెరువులోకి చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వల చుట్టుకొని చెరువులో మునిగి చనిపోయాడు. 01 జూలై నుంచి భారతదేశ కొత్త చట్టాలు అమలు కావడంతో,నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల,మరియు ఎస్ డి పి ఓ.ఏ గంగారెడ్డి. సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ గారి పర్యవేక్షణలో ఎస్.ఎచ్.ఒ సుమలత సెక్షన్ 194(1) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది.
ఎస్పి మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న పోలీసు అదికారులకు, సిబ్బందికి విడతలవారీగా శిక్షణ కార్యక్రమని నిర్వహించడం జరిగిందన్నారు.ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగిందని, బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం,నేరాల విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా రూపొందించడం జరిగిందని అన్నారు. కొత్త చట్టాల వర్తింపు మరియు నేరాలు మరియు దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై పోలీసు శాఖకు చెందిన డిఎస్పీ నుండి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking