ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి

 

ఎన్నికలలో యువత వంద శాతం ఓటు నమోదు చేసేలా స్వీప్ ద్వారా అవగాహనా కార్యక్రమాలు

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎన్నికల స్వీప్ నోడల్ అధికారి సాంబశివ రావు

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 28:
గురువారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ లోని వి సి హాల్ లో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో నోడల్ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని 5 నియోజక వర్గాలలో స్వీప్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో స్వీప్ కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఓటు హక్కు పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఓటు ప్రాముఖ్యత తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టి చైతన్యం తేవాలని అన్నారు. యువత వంద శాతం ఓటు నమోదు చేసేలా స్వీప్ ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేయాలనీ, పోలింగ్ కేంద్రానికి వెళ్లి తప్పనిసరిగా ఓటు వేసేలా క్యాంపస్ అంబాసిడర్లు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీలకు క్యాంపస్ అంబాసిడర్లను నియమించాలని అన్నారు. డబ్బు, మద్యం, బహుమతుల ఎన్నికల వేళ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా అభ్యర్థులను ఎన్నుకున్నట్లైతే తిరిగి వారి నుండి మనం మంచిని ఆశించవచ్చన్న విషయాన్ని యువ ఓటర్లకు తెలియజేయడం కనీస భాద్యత అని అన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయడం ద్వారా వంద నిమిషాలలో ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఓటు హక్కు పై అవగాహన కల్పించే విధంగా ప్రసారాలు చేయవచ్చన్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని స్వచ్ఛత, శానిటేషన్ ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందేలా చూడాలన్నారు. హై స్కూల్, కళాశాలల్లో సంకల్ప పత్రాలు పంపిణి చేయాలని, అట్టి పత్రల పై తల్లిదండ్రుల సంతకాలు సేకరించాలని అన్నారు. మెస్సేజ్ ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందేలా, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చైతన్యం కల్పించాలని అన్నారు. ప్రతి నియోజక పరిధిలో స్వీప్ ప్రోగ్రాం కోసం బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని, పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి కూడలి వద్ద ఓటు హక్కు గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఓటు హక్కు దేశంలోని ప్రతి ఒక్కరికి సమానమని అందరికి సమాన స్వేచ్ఛ, హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు.
ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ కృష్ణ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking