వివాహ వార్షికోత్సవం సందర్భంగా ముందస్తుగా సేవ చేయడమే భాగ్యంగా విన్నుత శ్రీకారం చుట్టిన తాజా మాజీ సర్పంచ్
బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్.
టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ.
దుబ్బాక నియోజకవర్గం మార్చ్ 11 ప్రజాబలం ప్రతినిధి :-
మెదక్ జిల్లా చేగుంట మండలంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి స్థానిక తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గారు చందాయి పేట గ్రామ ప్రజల ఆశీర్వాదంతో జిల్లా పరిషత్ హై స్కూల్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్స్ బాగా రాసి చందాయిపేట ను జిల్లాలోని మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ టెన్త్ క్లాస్ విద్యార్థుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు
శ్రీ. వి. కిషన్ , అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ బుడ్డసంతోష
సీనియర్ ఉపాధ్యాయులు అజిత. విట్టల్ రెడ్డి నర్సింలు.
సిద్ధి రాములు
బంగారయ్య దామోదర్. వీణ, సౌజన్య,స్వప్న, శ్రీనివాస్, రాములు, సలీం,గిరిధర్ ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
