మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు తూప్రాన్ పట్టణంలో పూట్ పాత్ పై పెట్టిన వస్తువులను తొలగించిన మున్సిపల్ సిబ్బంది.
తూప్రాన్, నవంబర్, 13.
ప్రజాబలం న్యూస్
మెదక్ జిల్ల తూప్రాన్ పట్టణంలో దుకాణాల ముందు యజమానులు పెట్టిన వస్తువులను మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది బుధవారం ఉదయం తొలగించారు. ఇక మీదట ఎవరైనా దుకాణాల ముందు గల పూట్ పాత్ పై ఎలాంటి వస్తువులు పెట్టిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి షాప్ తిరిగి యజమానులకు తగిన విధంగా సూచనలు సలహాలు ఇచ్చారు. ఇక మీదట ఎవరు కూడా పూట్ పాత్ లపై ఎలాంటి వస్తువులు కానీ, చిన్న చిన్న దుకాణాలు పెట్టవద్దని కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం తోపాటు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అలాగే వ్యాపారులు పూట్ పాత్ పై వస్తువులు పెట్టితే వాటిని సీజ్ చేసి ట్రాక్టర్ లో మున్సిపల్ ఆఫీస్ కు తరలించడం తో పాటు జరిమాన విధిస్తారని తెలిపారు. అలాగే వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మధు, వెంకటేష్, ఇర్ఫాన్ , వినోద్, తదితరులు పాల్గొన్నారు.