ఈ నెల 18 నుండి ప్రారంభం నామినేషన్ ప్రక్రియ

నోడల్ అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 15:

సోమవారం రోజున వీసీ మీటింగ్ హాల్లో మేడ్చల్ డిసిపి నితిక పంతు,అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి,నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు ఎంతో జాగ్రత్తగా చేపట్టాలన్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలు సంబంధిత నోడల్ అధికారులకు వివరించారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థి తో పాటు మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి ఉంటుందన్నారు. లోకసభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరం వరకు వాహనములు అనుమతించడం జరుగుతుందన్నారు. మూడు వాహనములకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ నెల 18 వ తేది నుండి 25 వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నామినేషన్ లు వేసేందుకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా https://suvidha.eci.gov.in సువిధ పోర్టల్ ను వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking