పశు మిత్ర వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి,మంచిర్యాల ఎమ్మెల్యే కు వినతిపత్రం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 29 : పశు మిత్ర వర్కర్స్ యూనియన్ (సిఐటియూ) ఆధ్వర్యంలో పశు మిత్రల సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమ్మెల్యేలకు,మంత్రులకు, అధికారులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం,పశు మిత్రలకు వేతనం పెంచకుండా వెట్టి చాకిరీ చేయుంచుకోవడం చాలా దారుణం.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వేతనం నిర్ణయం చెసి చెల్లించాలి.ఇర్సుల్ల శ్రీలత పశు మిత్ర వర్కర్స్ యూనియన్(సిఐటియూ) జిల్లా అధ్యక్షురాలు‌ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం రైతుల పశువులకు వైద్యం అందించడానికి,పాడి పరిశ్రమ కు మమ్మల్ని ఐకేపీ నుండి తీసుకొని ట్రేనింగ్ ఇచ్చారు.కానీ కనీస వేతనం ప్రభుత్వం నిర్ణయం చేయకుండా గత 8 సంవత్సరం ల నుండి ఉచితంగాసేవలు చేయించు కుంటున్నారు,పశువులకు ఇచ్చే మందులు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వకపోవడంతో మేము డబ్బులు పెట్టి మందులు కొని రైతుల పశువులకు వైద్యం అందిస్తున్నాం,ఎ ఐ ట్రేనింగ్ కూడా ప్రభుత్వం మధ్యలో ఆపేసింది.కనీసం ప్రభుత్వం మమ్మల్ని కార్మికులుగా కూడా గుర్తించడం లేదు.పీఫ్, ఈఎస్ఐ మరియు ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలి,ఎ ఐ ట్రేనింగ్ కూడా పూర్తి చేయాలి.ఈ కార్యక్రమంలో రాజేశ్వరి మల్లిక జిల్లా ఉపాధ్యక్షురాలు,మాణిశ్వరి, రవళి,రమదేవి,రేణుక,సంగీత, సంధ్య,మాధవి,లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking