ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది.

  • సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్ జెండర్ లకు ఓటర్ అవగాహన కార్యక్రమం.
  • 40% వికలాంగత్వం ఉన్నవారికి ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగం.
  • పోలింగ్ స్టేషన్లో అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటు.
  • పిడబ్ల్యుడి ఓటర్ల కోసం సాక్ష్యం అనే యాప్ ని ప్రవేశపెట్టిన ఎన్నికల సంఘం.
  • జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

సంగారెడ్డి ఏప్రిల్ 29 ప్రజ బలం ప్రతినిది:
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లాలోని సీనియర్ సిటిజన్ లు, ట్రాన్స్ జెండర్లు వికలాంగులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఈవీఎంలు వివి ప్లాట్ ల ద్వారా ఓటు వేసే విధానంపై ఈ సందర్భంగా వృద్ధులు ట్రాన్స్ జెండర్లు వికలాంగులకు అవగాహన కల్పించారు. 40% వికలాంగత్వం నుండి నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు, నడవలేని స్థితిలో ఉన్న వయోవృద్ధులకు ఇంటివద్దని ఓటు హక్కును వినియోగించుకుని సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించిందన్నారు.

The right to vote is like a diamond weapon in a democracy.

మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లో పాటు మెదక్ జిల్లాలోని మెదక్ పార్లమెంటు పరిధిలోకి వచ్చి సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గం అన్ని పోలింగ్ స్టేషన్లో వీల్ చైర్ ఏర్పాటు రాంపుల ఏర్పాటు తాగునీరు ఇతర మౌలిక వసతుల ఏర్పాటు కల్పించినట్లు తెలిపారు. 80 సంవత్సరాలు పైబడిన నడవలేని స్థితిలో ఉన్న సీనియర్ సిటిజన్లకు ఇంటివద్దని ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా వారి ఆయా పోలింగ్ స్టేషన్లో బిఎల్వోలు నిర్ణయిత ప్రొఫార్మాలు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారన్నారు. పిడబ్ల్యుడి ఓటర్ల కోసం ఎన్నికల సంఘం సాక్ష్యం అనే ఆప్ ను ప్రవేశపెట్టిందన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఓటు హక్కు వినియోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి అన్నారు.
ఈనెల 25 నుండి జిల్లాలోని ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు . కంటి చూపు లేని వారు బ్రెయిలీ లిపి ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్లు వికలాంగులు తో అధికారులు ఓటు హక్కు ను తప్పకుండా వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు ట్రాన్స్ జెండర్ ల కు ఐడి కార్డులు పంపిణీ చేశారు.

The right to vote is like a diamond weapon in a democracy.
ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ శాతం పెంచాలని,
ప్రజాస్వామ్యo ఓటు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.
అనంతరం సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్లు,వికలాంగులు, అధికారులు ఓటర్ల తో ఓటర్ ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డి డబ్ల్యు, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి అఖిలేష్ రెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీనియర్ సిటిజన్లో ట్రాన్స్ఫర్ జెండర్లు వికలాంగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking