వివేకానంద సేవ సమితి చేస్తున్న సేవలు అభినందనీయం..మంత్రి శ్రీధర్ బాబు

 

(కూకట్‌పల్లి, ప్రజాబలం న్యూస్)
మార్చి 09

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి వివేకానంద సేవ సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి శనివారం కూకట్‌పల్లిలో వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో చైర్మన్ హన్మంతరావు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు, శాంతా బయోటెక్స్ చైర్మన్ కె వి వరప్రసాద్ రెడ్డి, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ బండి రమేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ
ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రాకూడదని, రైతులు ఇక ముందు ఆత్మహత్యలు చేసుకోకూడదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే దేశాభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని హామీ ఇచ్చారు. రైతు కుటుంబాలను ఆదుకుంటున్న వివేకానంద సేవ సమితి చైర్మన్ హన్మంతరావును ఆయన అభినందించారు. అనంతరం కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తుందన్నారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. నిరుపేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకు వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking