రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు దేశంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా పింఛన్లు అందచేస్తోంది

 

రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 23:
దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ విషయంలో దివ్యాంగులకు దేశంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా పింఛన్లు అందచేస్తున్న రాష్ట్రం మనదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అమలు జరిగేలా చూస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో దివ్యాంగులకు రూ.3.016 నుంచి రూ.4,016లకు పెంచిన ఆసరా పెన్షన్ ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అర్హులైన 6,461 మంది దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం వారికి పెంచిన రూ.4,016 లను ప్రొసీడింగ్లను అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వివిధ రకాల పెన్షన్ పొందుతున్న మొత్తం లబ్ధిదారులు ఒక లక్ష 46వేల,922 మంది వీరికి ప్రతినెలా పంపిణీ చేయుచున్న మొత్తం 39 కోట్ల 63లక్షలు అని తెలిపినారు,
దివ్యాంగులకు మేడ్చల్ నియోజకవర్గంలో గతంలో రూ.3,016 చొప్పున రూ.1,94,88,376 ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచగా నియోజకవర్గంలో రూ.2,59,47,832 అందచేయడం జరుగుతుందని అన్నారు. అలాగే మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,863 మంది దివ్యాంగులకు రూ.3.016 పింఛన్ అందించిన సమయంలో రూ.6,59,38,808 ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం రూ.4.016 అందచేస్తోందని దీనికిగాను జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు ప్రతినెలా పింఛన్ రూ.2,18,63,000లకు పెరిగిందని దీంతో రూ.8,78,01,808 అందచేయాల్సి ఉంటుందని మంత్రి మల్లారెడ్డి సమావేశంలో వివరించారు.
దివ్యాంగులు ఎంతో ఆత్మస్థైర్యం, ధైర్యం కలిగి ఉంటారని అన్నారు. ప్రభుత్వం తరపున దివ్యాంగులకు ఎంత చేసినా తక్కువేనని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అలాగే దివ్యాంగులకు ఇల్లు లేని వారికీ డబుల్ బెడ్రూమ్లు కొరకు దరఖాస్తు చేసుకోవాలని వారికి మొదటి ప్రాధాన్యత కింద అలాట్ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం దివ్యాంగులకు ఆసరా పింఛన్లను రూ.4,016లకు పెంచారని ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని తెలిపారు. తెలంగాణలో దివ్యాంగుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు అమలుపరుస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, దమ్మాయిగూడ, ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్లు, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking