స్నానానికి వెళ్లి విద్యార్థి మృతి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన అయాజ్ (17) స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. ఇటీవలే పదోతరగతి పూర్తయిన ఈ విద్యార్థి వారి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆదివారం మిత్రులతో కలిసి సరదాగా భీమన్నగుట్ట ప్రాంతంలో ఉన్న పెద్ద నీటి కుంట( బ్లూ బౌడి ) లో స్నానానికి వెళ్లాడు. లోతు ప్రదేశంలోకి వెళ్లడంతో మునిగి చనిపోయాడు. పోలీస్ , అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking