ముది మాణిక్యం గ్రామంలో రామాలయాన్ని శుద్ధి చేయడం జరిగింది

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం భారత ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామంలో ప్రతి ఆలయాన్ని శుద్ధి చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ముది మాణిక్యం గ్రామంలో రామాలయాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబిసి రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజ్ పాల్గొనడం జరిగింది ఆయన మాట్లాడుతూ 22వ తారీకు జరిగే అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగడం మనకెంతో సంతోషకరమన్నారు 500 సంవత్సరాల నుంచి ఎదురుచూసిన ఈరోజు మన రాముడు ఆలయం నిర్మించడం ఎంతో ఆనందకరమన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో బిజెపి అందోల్ అసెంబ్లీ కన్వీనర్ మటమ్ చంద్రశేఖర్ పుల్కల్ పిఎసిఎస్ బ్యాంక్ చైర్మన్ అనంతరావు కులకర్ణి గారు, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు వెంకటనర్సింహా రెడ్డి,భారతీయ జనతా పార్టీ పుల్కల్ మండల అధ్యక్షులు కుమ్మరి పండరి కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీశైలం ఉపాధ్యక్షులు రమేష్ నవీన్ లక్ష్మణ్ గౌడ్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking