రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 17 అక్టోబరు 2024
మణికొండలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్య కర్తలు గత కొద్ది రోజులుగా ఇంటింటికి బస్తీ బస్తీకి వెళ్లి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజాభి ప్రాయ సేకరణలో భాగంగా సేకరిస్తున్న సందర్భముగా డాలర్ హిల్స్ కాలనీ, ఖిజ్రా కాలనీ దగ్గర నిర్మించిన నీటిని పంప్ చేసే బూస్టర్ వినియోగంలో ట్రాన్స్ఫార్మర్ లేదని కొద్దికాలం, సాంకేతిక కారణాల వల్ల మరి కొద్ది కాలంగా నిరుపయోగంగా ఉన్న విషయమై జలమండలి జనరల్ మానేజర్ కు వ్రాత పూర్వక పిర్యాదు ఇవ్వడమ్ జరిగిన దరిమిలా అట్టి బూస్టర్ ను అధికారులు సరిచేసి పని మొదలు పెట్టిన శుభ సందర్భముగా సదరు 18 వ డివిజన్ జనరల్ మానేజర్ ను, డెప్యూటీ జనరల్ మానేజర్ ను, మేనేజర్ లను కలసి సగౌరవంగా అభినందించి ధన్యవాదములు తెలిపిన వారిలో బి.ఆర్.ఎస్ పార్టీ మణికొండ మున్సిపాలిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కుంభగాళ్ల ధనరాజ్, సీనియర్ నాయకులు ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, ఉపేంద్రానాథ్ రెడ్డి, యాళల కిరణ్, కందాడ ప్రవీణ్, ఎర్రోళ్ల రమేష్, ఏం.కృపాకర్, సయ్యద్ ఆరీఫ్ సయ్యద్ అష్ఫక్ అలి, సయ్యద్ రఫీక్ తది తరులు కలరు.
