ఏండ్లు గడుస్తున్న నెరవేరని ఎమ్మెల్యే హామీ
ఎం.ఎస్.పి. జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం
జగిత్యాల, ఆగస్టు 9: ఎందరో ప్రాణాలను బలిగొన్న యావర్ రోడ్డు విస్తరణ పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా కలగానే రోడ్డు విస్తరణ మిగిలిందని మహాజన్ సోషలిస్ట్ పార్టీ జగిత్యాల జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం అన్నారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో విడుదల చేసిన ప్రకటనలో గంగారాం పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో పట్టణంలోని యావర్ రోడ్డును విస్తరణ చేపడతామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలమయ్యాడన్నారు. కేవలం ప్రభుత్వ స్థలాలను మాత్రమే వెనుకకు జరిపి యావర్ రోడ్డు విస్తరణను విస్మరించారన్నారు. జగిత్యాల పట్టణాన్ని నేనే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం ఎమ్మెల్యే సంజయ్ మానుకోవాలని కోరారు. జగిత్యాల మునిసిపల్ పై బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నా ఎవరు యావర్ రోడ్డు విస్తరణను చేపట్టగా పోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి రెండు నెలల్లోగా యావర్ రోడ్డు విస్తరణను పూర్తి చేయాలని దుమాల గంగారాం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సతీష్ మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా కో కన్వీనర్ సురుగు శ్రీనివాస్, జగన్, ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా కన్వీనర్ నక్క సతీష్ మాదిగ, జగిత్యాల ఎంఎస్పి డివిజన్ కన్వీనర్ బోనగిరి కిషన్, మాదిగ ఎంఎస్పి జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లె అనిల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ యువసేన ఇంచార్జ్ మాదిగ, బాలే అంజన్న, మాదిగ ఎంఎస్పి మండల ఇన్చార్జి తదితరులు పాల్గొన్నారు.